Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > ఆరు నెలల, సంవత్సరమా తెలీదు కానీ మళ్ళీ కేసీఆరే సీఎం..ఎమ్మెల్యే|

ఆరు నెలల, సంవత్సరమా తెలీదు కానీ మళ్ళీ కేసీఆరే సీఎం..ఎమ్మెల్యే|

Telangana Election Result News| ఎన్నికల్లో మిత్ర పక్షం సీపీఐ ( CPI ) తో కలిసి 65 సీట్లు గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ( Congress Party )ప్రభుత్వాన్ని ఏర్పాటు కు సిద్ధం అయ్యింది.

మరోవైపు బీఆరెస్ ( BRS ) 39 సీట్లకే పరిమితం అయ్యింది. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ( Station Ghanpur ) ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( Kadiyam Srihari ).

ఎమ్మెల్యే ( MLA ) గా నెగ్గిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన ఆయన ఈ మేరకు మాట్లాడుతూ..పార్టీ అధికారం లోకి రాలేదని ఎవరు భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు.

ఆరు నెలల, సంవత్సరమా, రెండు సంవత్సరాల తెలీదు కానీ మళ్ళీ ప్రభుత్వం బీఆరెస్ దే, మన సీఎం కేసీఆరే ( KCR ) అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి బొటా బోటి మెజారిటీ వచ్చింది దానిని కాపాడుకుంటారా లేదా అనేది చూడాలి అంటూ అనుమానం వ్యక్తపరిచారు.

ప్రజలు మార్పు కోరుకున్నారని, ప్రజాతీర్పును శిరసా వహిస్తామని, పటిష్టమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని తెలిపారు.

You may also like
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
మంచిగా చదువుకో బిడ్డా..కేసీఆర్ గొప్పమనసు
’17 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి హరీష్’..కేసీఆర్ పార్టీ రియాక్షన్
’12 మంది పిల్లలు..5 పందులు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions