Hyderabad Weather Report | తెలంగాణలో శుక్రవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
తెల్లవారుజామున వర్షంతో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. శుక్రవారం హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 20.5 డిగ్రీల సెల్సియస్ గా, గరిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యాయి.
ఈ వాతావరణ పరిస్థితులు రానున్న రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.

రానున్న నాలుగు రోజుల్లో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం కనిపిస్తుందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాసులు ఈ సీజన్‌లో మరో శీతాకాలపు చలికి సిద్ధంగా ఉండాలని పేర్కొంది.
జనవరి 8, 9 తేదీలలో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
Read Also: హెలికాప్టర్ లో సాంకేతిక లోపం.. బాలయ్యకు తప్పిన పెను ప్రమాదం!
హైదరాబాద్‌లోని చార్మినార్, ఖైరతాబాద్, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో జనవరి 10 వరకు ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశముందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది.
హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో కూడా చలిగాలులు వీచే అవకాశం ఉంది.
ఆది, సోమవారాల్లో తెలంగాణలోని ఉత్తరాది జిల్లాలు, ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాలలో కనిష్ట ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉంది.
కామారెడ్డి, మెదక్, సంగారెడ్డిలో కూడా సోమవారం కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఐఎండీ హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు.
ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 15.5 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 25.3 డిగ్రీలు
మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 16.8, గరిష్ట ఉష్ణోగ్రత 29.2,
మహబూబ్ నగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 20.6, గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలు
రామగుండంలో కనిష్ట ఉష్ణోగ్రత 18.4, గరిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీలు
నిజామాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 18.5, గరిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీలు
నల్లగొండలో కనిష్ట ఉష్ణోగ్రత 19.0, గరిష్ట ఉష్ణోగ్రత 28.5 డిగ్రీలు
ఖమ్మంలో కనిష్ట ఉష్ణోగ్రత 21.6 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలు
భద్రాచలంలో కనిష్ట ఉష్ణోగ్రత 22.0 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలు
హకీంపేట్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 18.4, గరిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీలు,
దుండిగల్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 19.6 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలు.