Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు..13 నిమిషాల్లో 13 కి.మీ.

హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు..13 నిమిషాల్లో 13 కి.మీ.

Hyderabad Metro Rail creates 13-km green channel to facilitate heart transplant | ఒక ప్రాణాన్ని కాపాడేందుకు హైదరాబాద్ మెట్రో గ్రీన్ కారిడార్ ( Green Corridor ) ను ఏర్పాటు చేయడంతో దాత గుండెను వైద్యులు అత్యంత వేగంగా తరలించారు.

కేవలం 13 నిమిషాల్లో 13 కి.మీ. దూరాన్ని చేరుకున్నారు. ఈ క్రమంలో 13 మెట్రో స్టేషన్లను దాటేశారు. ఎల్బీ నగర్ ( LB Nagar ) లోని కామినేని ఆసుపత్రిలో ఓ దాత గుండెను డొనేట్ ( Donate ) చేశారు.

దీన్ని లక్డీకాపూల్ ( Lakdi-Ka-Pul ) లోని గ్లెనిగేల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో ఉన్న వ్యక్తికి అమర్చాలి. రోడ్డు మార్గాన వెళ్తే ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో గుండెను తరలించడానికి జనవరి 17న రాత్రి 9.30 నిమిషాలకు గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేసింది.

దింతో వైద్యులు మెట్రో రైలులో గుండెను తరలించి ట్రాన్సప్లాంటేషన్ సర్జరీని చేశారు. ఎటువంటి ఆటంకం, ఆలస్యం లేకుండా దాత గుండెను మెట్రో రైలులో తరలించారు. 13 కి.మీ. దూరాన్ని కేవలం 13 నిమిషాల్లోనే చేరుకున్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions