Vijay To Enter Politics | దక్షిణాదిన సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం తరచుగా జరుగుతూనే ఉంటుంది.
ముఖ్యంగా తెలుగు, తమిళ నాట పెద్ద హీరోలు రాజకీయ పార్టీలు పెట్టి విజయం కూడా సాధించారు.
అప్పట్లో సినిమాల్లో తిరుగులేని హీరోగా ఉన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)ని స్థాపించిన కొద్దీ నెలల్లోనే సీఎం అయ్యారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 70 లక్షలకు పైగా ఓట్లని రాబట్టగలిగారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా తమిళనాడు లో రాజకీయాలకు, సినిమాలకు విడదీయరాని సంబంధం ఉంది.
ఎంజి రామచంద్రన్, జయలలిత, విజయకాంత్, కమలహాసన్ ఇలా సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు.
ఇప్పుడు తమిళనాట మరో ప్రముఖ హీరో రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తుంది.
Dhalapathy vijay to start padayatra | సౌత్ సినీ ఇండస్ట్రీలో దళపతి విజయ్ పేరు తెలియని సినిమా అభిమాని ఉండరు.
మరీ ముఖ్యంగా తమిళనాడులో అయితే విజయ్ (Vijay Dalapathi)ని తన అభిమానులు దేవుడిలా కొలుస్తారు. ఆయన రాజకీయాల్లోకి రానున్నారంటూ కొన్నాళ్లుగా రూమర్లు పుడుతూనే ఉన్నాయి.
కొన్ని సందర్భాల్లో ఆ రూమర్లను విజయ్ కొట్టిపారేశారు.
ఇదిలా ఉండగా.. తాజాగా విజయ్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ముందుగా విజయ్ పాదయాత్ర చేయనున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రాజకీయ అరంగేట్రం కంటే ముందు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ పాదయాత్ర (Hero Vijay Padayatra) చేయనున్నట్లు సమాచారం.
ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం జులై 11న విజయ్ తన అభిమాన సంగం అయిన ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ (VMI) సభ్యులతో భేటీ అయ్యారు.
ఆ భేటీలో రాజకీయ అంశాల గురుంచి చర్చించినట్లు తన అభిమానులు తెలిపారు.
అలాగే ఈ సంగం సభ్యులతో తరచూ భేటీ అవుతున్నారు. నిన్న జరిగిన భేటీలో పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్లు కథనాలు వస్తున్నాయి.
ఆయన నటించిన తాజా చిత్రం ‘లియో’ విడుదల కంటే ముందే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది.
లియో చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. దీనిపై అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో వెలువడనుంది.
ఇక ఇటీవల విజయ్ తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాల వారిగా టెన్త్ , ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు.
అప్పటి నుండి విజయ్ రాజకీయాల్లోకి రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి విజయ్ రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్ దళపతి అవ్వగలరా అనేది వేచి చూడాలి.









