Sunday 20th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > మోసం చేశాడు..ఆర్సీబీ ప్లేయర్ పై సీఎంకు యువతి ఫిర్యాదు

మోసం చేశాడు..ఆర్సీబీ ప్లేయర్ పై సీఎంకు యువతి ఫిర్యాదు

Ghaziabad woman files FIR against RCB pacer Yash Dayal for sexual harassment | ఐపీఎల్ లో భాగమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం స్టార్ బౌలర్ యశ్ దయాల్ పై సంచలన ఆరోపణలు చేసింది ఓ యువతి.

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదు సంవత్సరాల పాటు తనను మానసికంగా, శారీరకంగా హింసించి మోసం చేశాడని ఆరోపించిన సదరు యువతి యశ్ దయాల్ పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసింది. యూపీలో ఘజియబాద్ కు చెందిన యువతి యశ్ దయాల్ పై ఈ ఆరోపణలు చేశారు.

గత ఐదేళ్లుగా తామిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నామని కాబోయే కోడలు అని యశ్ తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేసాడని ఫిర్యాదు ఆమె పేర్కొంది. ఈ క్రమంలో తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని తీవ్ర ఆరోపణలు చేసింది.

తనతో రిలేషన్షిప్ లో ఉన్న సమయంలోనే ఇతర అమ్మాయిలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందని ఆమె తెలిపింది. అయితే దీనిపై మొదట మహిళల హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి జూన్ 14న ఫిర్యాదు చేసినట్లు కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.

ఈ క్రమంలో యశ్ దయాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం ఆన్లైన్ పోర్టల్ లో ఫిర్యాదు చేసినట్లు సదరు యువతి వెల్లడించింది. యశ్ దయాల్ తో దిగిన ఫోటోలు, వీడియో కాల్స్, చాటింగ్ స్క్రీన్ షాట్లను పోలీసులకు అప్పగించినట్లు తెలిపింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions