తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం (CPM) సంచలన నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం వరకు కాంగ్రెస్ (Congress Party)తో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లలో పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది.
కానీ సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ జాప్యం చేస్తుండటంతో, గురువారం మధ్యాహ్నం వరకు సీపీఎం కి టికెట్లు కేటాయించాలని డెడ్ లైన్ విధించారు ఆ పార్టీ నాయకులు.
కానీ కాంగ్రెస్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడం తో ఒంటరిగానే బరిలోకి దిగానున్నట్లు స్పష్టం చేశారు సీపీఎం తెలంగాణ సెక్రటరీ తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram). ఈ మేరకు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సీపీఎం తొలి జాబితాను ప్రకటించారు.
17 సీట్లలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు తమ్మినేని. అలాగే బీజేపీ (BJP) బలంగా ఉన్న స్థానాల్లో అక్కడ గెలిచే అవకాశం ఉన్న ఇతర పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, అంతే కాకుండా బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేయబోమని వ్యాఖ్యానించారు తమ్మినేని. కాంగ్రెస్ వైఖరి మూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.