- బీఆరెస్ కు కాంగ్రెస్ కౌంటర్!
Congress Counter To BRS | తెలంగాణలో కాంగ్రెస్ (Congress) పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు, నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందిస్తూ.. చోటామోటా కాంట్రాక్టర్లు కూల్చితే కూలే ప్రభుత్వం కాదని, ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు తమకు ఉందని చెప్పారు. బీఆర్ఎస్ కు అమ్మడం, కొనడంపై అనుభవం ఉందని, ఎమ్మెల్యేలు సంతలో పశువులు కాదని పీసీసీ చీఫ్ కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలతో చర్చించి కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలపై తగిన నిర్ణయం తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు.
కేసీఆర్ తన వ్యాఖ్యలనే తన ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడించారని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుంది.. దీనిపై విచారణ జరిపే ఆలోచన చేస్తామన్నారు. కొత్త ప్రభాకర్ కు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉందేమోనని ఎద్దేవా చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డికి నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో కలిసి గుజరాత్ వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. సిగ్గుశరం లేకుండా ఏది పడితే అది మాట్లాడ్తున్నారనీ, విచారణ జరిపి నిజాలు చెప్పించాలని వ్యాఖ్యానించారు.