Sajjanar Serious On Youtuber Harsha Sai | బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ల ( Inluencers )పై తీవ్రంగా మండిపడుతున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనర్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్‌ప్లూయెన్సర్లను బ్లాక్ చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే సజ్జనర్ పోస్టుతో మోటోవ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి చేసిన వ్యాఖ్యల పట్ల సజ్జనర్ కన్నెర్ర చేశారు.
ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ను తాము ప్రమోట్ చేయకపోతే ఇతరులు చేస్తారని, అందుకే తాను చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సజ్జనర్ స్పందించారు. చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి అని హర్ష సాయి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు! అని హర్షసాయి పై సజ్జనర్ సీరియస్ అయ్యారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదన్నారు.
వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం.. ఎవరూ ఎక్కడ పోయినా, సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన సంబంధం లేదని పేర్కొన్నారు. యువత ఫాలోయింగ్ ని మార్కెట్‌లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్లనా.. మీరు ఫాలో అవుతోందని నెటీజన్లను సజ్జనర్ ప్రశ్నించారు.
వెంటనే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయాలని పిలుపునిచ్చారు. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టాలని సూచించారు.