Friday 14th August 2026
12:07:03 PM
Home > Uncategorized > ప్రచారాన్ని వదిలి పసిబిడ్డకు ప్రాణం పోసిన టీడీపీ అభ్యర్థి!

ప్రచారాన్ని వదిలి పసిబిడ్డకు ప్రాణం పోసిన టీడీపీ అభ్యర్థి!

dr gottipati lakshmi

Dr Gottipati Lakshmi | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ప్రచార వేగాన్ని పెంచారు అభ్యర్థులు. అయితే ఇంతటి రాజకీయ వేడిలోను వృత్తి ధర్మాన్ని పాటించారు దర్శి(Darshi) నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ.

టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ (Gottipati Lakshmi) వృత్తిరీత్యా డాక్టర్. గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమెకు ఓ తల్లి పడుతున్న బాధను విని వెంటనే స్పందించారు.

అబ్బాయిపాలెం కు చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. అయితే సమయానికి ఆసుపత్రిలో గైనకాలాగిస్ట్ లేకపోవడంతో గుంటూరు లేదా ఒంగోలు కు గర్భిణీని తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

ఈ విషయం తెలుసుకున్న గొట్టిపాటి లక్ష్మీ, ప్రచారానికి బ్రేక్ ఇచ్చి, గర్భిణీ ఉన్న హాస్పిటల్ కు వెళ్లారు. ఆపరేషన్ చేసి తల్లీ, బిడ్డను రక్షించారు. మానవత్వాన్ని చాటిన గొట్టిపాటి లక్ష్మిని అందరూ అభినందిస్తున్నారు.

You may also like
ప్రాణాలు పోతాయని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చి..!
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions