Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తాజా > వాళ్ల ఆవేదన నన్ను కలిచివేసింది: రాహుల్ గాంధీ!

వాళ్ల ఆవేదన నన్ను కలిచివేసింది: రాహుల్ గాంధీ!

Rahul Gandhi

Rahul Gandhi Visits Ashok Nagar | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఇందులో భాగంగా శనివారం రాత్రి అశోక్ నగర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ అవుతున్న యువతతో భేటీ అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆరెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.

“తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని, రాష్ట్రం వచ్చి పదేళ్లయినా తమ ఆకాంక్షలు నెరవేరలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడం నన్ను కలిచివేసింది.

కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు. నోటిఫికేషన్లు లేక, కోర్టు కేసులతో, పేపరు లీకులతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు.

వారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే వారికి కొలువులు రాని దుస్థితి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం.” అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.

You may also like
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు!
వందేమాతరం వివాదం: సోనియా, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు!
ఏఐసీసీ ఆఫీసులో వందేమాతరం వివాదం.. సోనియా, రాహుల్ హావభావాలపై బీజేపీ ఫైర్!
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions