Thursday 5th November 2026
12:07:03 PM
Home > ఇతర విభాగాలు > Chandrayaan 3: చంద్రయాన్‌ కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం!

Chandrayaan 3: చంద్రయాన్‌ కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం!

Chandrayaan 3
  • షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి

చంద్రయాన్‌-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమై 24 గంటలు కొనసాగనుంది.

అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌.. వాహకనౌకను పరిశీలించారు. అనంతరం భాస్కరా అతిథి భవనానికి చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు.

చంద్రయాన్‌-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ వీరముత్తువేల్‌, ఎల్‌వీఎం-3పీ4 మిషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.మోహన్‌కుమార్‌, అసోసియేట్‌ మిషన్‌ డైరెక్టర్‌ నారాయణన్‌, వెహికల్‌ డైరెక్టర్‌ బిజూస్‌ థామస్‌ ఉన్నారు.

చంద్రయాన్-3 ప్రయోగం భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి ఒక ముఖ్యమైన మైలురాయి. చంద్రుని గురించి మరియు దాని చరిత్ర గురించి మరింత తెలుసుకోవడానికి ఈ మిషన్ భారతదేశానికి సహాయం చేస్తుంది.

భవిష్యత్తులో చంద్రుని మిషన్ల కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఇది భారతదేశానికి సహాయపడుతుంది.

You may also like
TG: ‘అర్నబ్’ తుపాను కల్లోలం: 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions