Wednesday 6th May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు అఫిడవిట్..పెరిగిన ఆస్తులు, కేసులు!

చంద్రబాబు అఫిడవిట్..పెరిగిన ఆస్తులు, కేసులు!

Chandra Babu Naidu

Chandra Babu Affidavit | మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) కుప్పం (Kuppam) నియోజకవర్గ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అఫిడవిట్ ను సమర్పించారు.

కాగా తన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు చంద్రబాబు. 2019 కంటే ముందు బాబు పై కేవలం రెండు కేసులు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 24 కు చేరింది. అలాగే 2019 ఎన్నికల తో పోల్చితే ఆస్తులు భారీగా పెరిగాయి.

2019 లో టీడీపీ అధినేత ఆస్తులు రూ.545 కోట్లు ఉండగా ఇప్పుడు అవి రూ.931 కోట్లకు చేరింది. అఫిడవిట్ ప్రకారం చంద్రబాబుకు రూ.4 లక్షల 80 వేల చరాస్థులు, రూ.36 కోట్ల 31 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి. సతీమణి భువనేశ్వరి పేరిట ఏకంగా రూ.895 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

వీటిలో హెరిటేజ్ షేర్ల విలువే రూ.763 కోట్ల పై మాట. చంద్రబాబు, కుమారుడు లోకేశ్‌తో కలిసి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions