KTR Slams Congress | తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రేమ అనే బజారులో విద్వేష దుకాణం తెరిచిందని మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిందని ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
ఇందులో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి సిద్దిపేటలో హై డ్రామా నెలకొంది. హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసాయి కాంగ్రెస్ శ్రేణులు. ఈ నేపథ్యంలో బీఆరెస్, కాంగ్రెస్ శ్రేణులు మధ్య ఉద్రిక్తత నెలకొంది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు హరీష్ రావు క్యాంపు కార్యాలయంలోకి దూసుకువచ్చే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో స్పందించారు కేటీఆర్. కాంగ్రెస్ కు చెందిన గుండాలు హరీష్ రావు కార్యాలయం పై దాడి చేశారని ఆయన ఆరోపించారు. అలాగే విద్వేష బజారులో ప్రేమ దుకాణం అంటే ఇదేనా అని కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. రాజ్యాంగం యొక్క స్వయం ప్రకటిత రక్షకునిగా రాహుల్ గాంధీ ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు.