Boat Men Demand In Vijayawada | ఆంధ్రప్రదేశ్ లో (AP Rains) వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఓ వైపు బుడమేరు (Budameru), మరోవైపు ప్రకాశం బ్యారేజి (Prakasham Barriage) లో వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో విజయవాడ (Vijayawada) నగరం జలదిగ్బంధం లోకి వెళ్ళింది.
లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు నీట మునిగాయి. జనజీవనం స్థంభించిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బొట్లు, హెలికాఫ్టర్లు, డ్రోన్ల సహాయంతో బాధితులకు ఆహారం, నీరు అందిస్తున్నారు.
అలాగే పూర్తిగా వరదల్లో చిక్కుకున్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొద్దిమంది ప్రైవేట్ బోటు యజమానులు మానవత్వాన్ని మరిచి విపత్తు సమయంలో కూడా ప్రజల జీవితాలతో వ్యాపారం చేస్తున్నారు.
బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే ఒక్కో బోటుకు రూ.1500 నుండి రూ.4000 కిరాయి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దింతో డబ్బులు వసూలు చేస్తున్న కొద్దిమంది బోటు యజమానులు తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.