Sunday 13th July 2025
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ ఆర్టీసీ ఎన్ని కోట్ల ఉచిత టికెట్లు ఇచ్చిందో తెలుసా!

తెలంగాణ ఆర్టీసీ ఎన్ని కోట్ల ఉచిత టికెట్లు ఇచ్చిందో తెలుసా!

tgsrtc

TGSRTC Zero Tickets | తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం (TG Mahalaxmi Scheme) ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.6,088 కోట్లు విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రకటించారు.

ఈ స్కీం కింద ఆర్టీసీ ఇప్పటివరకు 182 కోట్ల జీరో-ఫేర్ టిక్కెట్లను జారీ చేసిందని వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలోని ఆర్టీసీ డిపోలో 45 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు.  మహాలక్ష్మి పథకం విస్తృతంగా ప్రజాదరణ పొందిందని, ఇతర రాష్ట్రాల్లోని మహిళలు ఇప్పుడు ఇలాంటి ప్రయోజనాలను కోరుతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు.

ఈ పథకం మహిళలకు సాధికారత కల్పించడమే కాకుండా ఆర్టీసీకి ఆర్థికంగా మరియు సామాజికంగా మద్దతు ఇస్తుందన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు రవాణాను ఆధునీకరించడానికి, రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. సూర్యాపేటలో 79 బ్యాటరీ బస్సులకు ఆమోదం లభించగా, హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు.

ఆర్టీసీకి ఆర్థికంగా మరియు సామాజికంగా మద్దతు ఇస్తుందన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు రవాణాను ఆధునీకరించడానికి, రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. సూర్యాపేటలో 79 బ్యాటరీ బస్సులకు ఆమోదం లభించగా, హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు.

You may also like
‘కల్తీ కల్లు ఘటన..రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి’
‘నారా లోకేశ్-మాధవ్ భేటీ..తెలంగాణ అస్థిత్వంపై దాడి’
‘సకాలంలో యూరియాను సరఫరా చేయండి’
bandi sanjay comments
పేదలకు ఒక న్యాయం.. అక్బరుద్దీన్ కుఒక న్యాయమా: బండి సంజయ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions