BJP Disagrees With Kangana Ranaut’s Controversial Remark’s | బాలీవుడ్ ( Bollywood ) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ( Kangana Ranaut ) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గతంలో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఉద్యమం చేసిన విషయం తెల్సిందే.
తాజాగా రైతు ఉద్యమంపై కంగనా మాట్లాడారు. కేంద్రంలో బలమైన నాయకత్వం లేయపోయి ఉంటే రైతుల ధర్నాతో బంగ్లాదేశ్ ( Bangladesh ) లో నెలకొన్న పరిస్థితులు భారత్ లో కూడా వచ్చేవన్నారు. రైతు ఉద్యమ సమయంలో శవాలు వేలాడేవాని, అత్యాచారాలు జరిగేవాని ఆమె ఎక్స్ వేదికగా చెప్పారు.
అంతేకాకుండా రైతు ఉద్యమం వెనుక చైనా ( China ), అమెరికా ( USA ) దేశాల కుట్ర ఉందని ఆరోపించారు. దింతో కంగనా వ్యాఖ్యలపై విపక్షాలు, అఖిల భారత కిసాన్ సభ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కంగనా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో తొలిసారి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ బహిరంగంగా తప్పుపట్టింది. ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతం అని, పార్టీ అభిప్రాయం కిందకు రావని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కంగనాను బీజేపీ ఆదేశించింది.