Chandra Babu Naidu | ఏపీ స్కిల్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఆరోపణలతో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu)కు బిగ్ రిలీఫ్ లభించింది.
ఈ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ స్కాం కేసులో టీడీపీ (TDP) చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ (Bail) పిటిషన్‌పై కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది.
చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తి.. జస్టిస్ టి.మల్లికార్జున్‌రావు ఈ మేరకు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారు.
చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా (Siddarth Luthra), దమ్మాలపాటి శ్రీనివాస్.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నబాబుకు అవే షరతులు వర్తించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28న మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన తర్వాత ఆ షరతులు కూడా తొలగిపోతాయని కోర్టు వెల్లడించింది.
దీంతో చంద్రబాబు నవంబర్ 29 నుంచి చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే 30న చంద్రబాబు ఏసీబీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు.