Monday 9th December 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖ షిప్పింగ్ హార్బర్ లో ప్రమాదానికి కారణం అతడేనా!

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో ప్రమాదానికి కారణం అతడేనా!

vizag fire accident

Visakhapatnam Port | విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

మొదట లంగర్ వేసి ఉన్న ఒక బోటులో మంటలు చెలరేగగా తర్వాత పక్కనే ఉన్న ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి.

ఈ ఘటనలో సుమారు 40-50 బొట్లు కాలి బూడిదయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది.

అయితే అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. కాగా ఈ ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం జగన్. బాధితులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ప్రమాద ఘటనపై లోతైన విచారణ జరపాలని అధికారులకు సూచించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సిదిరి అప్పలరాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

అయితే ఈ అగ్ని ప్రమాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్లో లంగర్ వేసిన ఉన్న బోటులో ఓ యూట్యూబర్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

వారి కోసం వంటకాలు చేస్తున్న సందర్భంగా మంటలు చెలరేగినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి జరిగిన పార్టీపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

You may also like
rushikonda builing
రుషికొండ భవనం పై TDP vs YCP!
ys jagan
ఎన్నికల తర్వాత విశాఖలోనే: సీఎం జగన్ సంచలన ప్రకటన!
local boy nani
విశాఖ అగ్ని ప్రమాద ఘటనపై లోకల్ బాయ్ నాని కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions