Tuesday 15th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పాక్ ఆర్మిపై విరుచుకుపడుతున్న బలోచ్ ‘డెత్ స్క్వాడ్’

పాక్ ఆర్మిపై విరుచుకుపడుతున్న బలోచ్ ‘డెత్ స్క్వాడ్’

Baloch Liberation Army Captures Town In Balochistan | జమ్మూకశ్మీర్ పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి.

ఈ క్రమంలో భారత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు పాక్ ప్రభుత్వం, నేతల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దింతో పాక్ నేతలు, ఆర్మి, ఆ దేశంలో తలదాచుకుంటున్న ఉగ్రవాదులు భారత్ పై విషం చిమ్ముతున్నారు. యుద్ధానికి కూడా సిద్ధమే అనే విధంగా పిచ్చి ప్రేలాపణలు చేస్తున్నారు.

పాక్ పైకి గంభీరంగా కనిపిస్తున్నా ఆ దేశం అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పాకిస్థాన్ లోని బలోచిస్థాన్ ప్రావిన్స్ తీవ్ర వివక్షకు గురవుతోంది. బలోచిస్థాన్, పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ, ఆర్థికంగా, రాజకీయంగా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతంగా ఉంది.

బలోచిస్థాన్ లో సహజ వనరులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం, కానీ దీని సంపద స్థానిక బలోచ్ ప్రజలకు పెద్దగా ఉపయోగపడడం లేదు. దింతో బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మి స్వాతంత్ర్యం కోసం గత కొన్నేళ్లుగా పోరాడుతుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ఆర్మిపై విరుచుకుపడుతుంది. పహల్గాం దుర్ఘటన అనంతరం భారత సరిహద్దు వద్ద సవాళ్ళను ఎదురుకుంటున్న పాక్ ఇప్పుడు బలోచ్ రెబల్స్ మూలంగా తల పట్టుకుంటుంది.

తాజగా బలోచ్ లిబరేషన్ ఆర్మి ఆధ్వర్యంలోని డెత్ స్క్వాడ్ బలోచిస్థాన్ ప్రావిన్సు కలత్ జిల్లాలోని మంగోచెర్ పట్టణాన్ని తన ఆదీనంలోకి తెచ్చుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు ప్రస్తుతం బలోచ్ లిబరేషన్ ఆర్మి కంట్రోల్ లోనే ఉన్నాయి. అంతేకాకుండా ఆర్మి క్యాంపుపై దాడి చేసిన బలోచ్ తిరుగుబాటుదారులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఏప్రిల్ 26న జరిగిన ఈ దాడిలో 10 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. భారత్ సరిహద్దు వద్దకు పాక్ తన సైన్యాన్ని తరలిస్తున్న క్రమంలో బలోచ్ ల నుండి వరుస ఎదురుదెబ్బలు తగులుతుండడం పాక్ ప్రభుత్వాన్ని కలవర పెడుతుంది. మార్చి నెలలో బలోచ్ లిబరేషన్ ఆర్మి రైలును హైజాక్ చేసిన విషయం తెల్సిందే మ్

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions