Thursday 8th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > జనసేనానిపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు!

జనసేనానిపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు!

Balakrishna On Pawan kalyan| టీడీపీ ( TDP ) నేత, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గురువారం నాడు హిందూపూర్ ( Hindhupur ) లో టీడీపీ జనసేన ( Janasena ) సమన్వయ సమావేశం లో పాల్గొన్నారు. ఈ మేరకు మాట్లాడుతూ తమ్ముడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కు తనకు కొన్ని విషయాల్లో సారూప్యత ఉందని తెలిపారు.

ఇద్దరమూ ముక్కుసూటి మనుషులమని, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతామని తెలిపారు. అక్రమాలు, అవినీతి చేసే వారిని ఇద్దరమూ లెక్క చేయమని స్పష్టం చేశారు బాలకృష్ణ.

ఈ సందర్భంగా జనసేన, టీడీపీ కండువా లను వేసుకొని జై టీడీపీ, జై జనసేన అంటూ నినదించారు బాలకృష్ణ. అలాగే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి టీడీపీ కి మద్దతు తెలపడాన్ని అభినందించారు.

అభివృద్ధి చేతకాక మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ( Cm Jagan ) కాలయాపన చేసారని విమర్శించారు. నేరస్థుల పాలనతో ఏపీ ( AP )లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి టీడీపీ-జనసేన కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు హిందూపూర్ ఎమ్మెల్యే.

You may also like
‘కుటుంబ సభ్యుల మృతి..భారత్ కు వార్నింగ్ ఇచ్చిన ఉగ్రవాది’
‘ఆపరేషన్ సింధూర్..ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్’
ధర్మశాల ఎయిర్పోర్ట్ క్లోజ్..’ముంబయి ఇండియన్స్’ పై ఎఫెక్ట్
‘హనుమంతుడి లంకా దహణమే మన ఆదర్శం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions