Friday 5th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > యాపిల్ సీఈఓ టిమ్ కుక్ రాజీనామా.. సెప్టెంబర్ 1 నుంచి..

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ రాజీనామా.. సెప్టెంబర్ 1 నుంచి..

tim cook

Apple CEO Tim Cook resigns | ప్రపంచ టెక్ దిగ్గజం ‘యాపిల్’ లో కీలక భారీ మార్పు చోటుచేసుకుంది. గత 15 ఏళ్లుగా సంస్థను  నడిపిస్తున్న సీఈఓ టిమ్ కుక్ (Tim Cook), తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతల నుండి తప్పుకోనున్నారు. టిమ్ కుక్ వారసుడిగా యాపిల్ ప్రస్తుత సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టెర్నస్ (John Ternus) నియమితులయ్యారు. ఐఫోన్, ఐప్యాడ్ వంటి విజయవంతమైన ఉత్పత్తుల రూపకల్పనలో టెర్నస్ కీలక పాత్ర పోషించారు.

యాపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆయన నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.  2011లో స్టీవ్ జాబ్స్ మరణం తర్వాత యాపిల్ పగ్గాలను అందుకున్న టిమ్ కుక్, కంపెనీని కేవలం గ్యాడ్జెట్ మేకర్‌గానే కాకుండా ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా తీర్చిదిద్దారు.

ఆయన హయాంలోనే యాపిల్ మార్కెట్ విలువ ఊహించని విధంగా పెరిగింది. ఐఫోన్ ఎక్స్ నుండి విజన్ ప్రో వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులు ఆయన సారథ్యంలోనే జరిగాయి.

రాజీనామా అనంతరం టిమ్ కుక్ సంస్థకు సలహాదారుగా ఉంటారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం: ఈ వార్త వెలువడిన వెంటనే యాపిల్ షేర్లు స్వల్పంగా ఒడిదుడుకులకు లోనయ్యాయి.

అయితే, జాన్ టెర్నస్ వంటి అనుభవజ్ఞుడికి బాధ్యతలు అప్పగించడంపై ఇన్వెస్టర్లు సానుకూలంగానే స్పందిస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions