Thursday 17th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఆర్సీబీని కొనుగోలు చేయనున్న విరాట్ సతీమణి

ఆర్సీబీని కొనుగోలు చేయనున్న విరాట్ సతీమణి

Anushka Sharma to acquire 3% stake in RCB | టీం ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు సంబంధించి ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ లో భాగమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టేందుకు అనుష్క సిద్ధమయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆర్సీబీ జట్టును యాజమాన్యం అమ్మకానికి పెట్టినట్లు గతేడాది నుండి కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో అనుష్క ఫ్రాంఛైజీలో కొంతభాగాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారట.

రూ.400 కోట్లు వెచ్చించి మూడు శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇకపోతే ఆర్సీబీ జట్టులో అగ్ర ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఆర్సీబీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుష్క ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా 2025లో బెంగళూరు జట్టు సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెల్సిందే.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions