All India Forward Bloc Wins Municipality in Telangana | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంచలన విజయం నమోదైంది. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీఆరెస్ సైతం పోటీ ఇస్తుంది. అయితే ప్రధాన పార్టీలను ఢీ కొట్టి ఆ అభ్యర్థులను ఓడించి జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. మొత్తం 10 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో 8 చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్, బీఆరెస్ కేవలం ఒక స్థానానికి మాత్రమే పరిమితం అయ్యాయి.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో చర్చలు జరిపారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు వడ్డేపల్లిలో కీలక నేత అయిన శ్రీను కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. అనంతరం సింహం గుర్తుపై జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేశారు. తాజగా వెలువడిన ఫలితాల్లో ఎనమిది చోట్ల విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.










