Friday 27th November 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వాట్సాప్ యూజర్లకు కేంద్రం హై-అలర్ట్!

వాట్సాప్ యూజర్లకు కేంద్రం హై-అలర్ట్!

ssc hall tickes on whatsapp
  • మీ డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం..
  • వెంటనే యాప్ అప్‌డేట్ చేయాలని CERT-In హెచ్చరిక!

CERT In WhatsApp Warning ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తీవ్ర హెచ్చరిక (High-Severity Advisory) జారీ చేసింది. ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (iOS), మ్యాక్ (Mac), విండోస్ (Windows) ప్లాట్‌ఫారమ్‌లలోని వాట్సాప్ వెర్షన్లలో పలు కీలక భద్రతా లోపాలు (Vulnerabilities) ఉన్నాయని గుర్తించింది. వీటిని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు మీ డివైజ్‌లోకి చొరబడి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని నవంబర్ 26న విడుదల చేసిన అడ్వైజరీలో పేర్కొంది.

ప్రత్యేకంగా రూపొందించిన మెసేజ్‌లు, అటాచ్‌మెంట్‌లు లేదా లింక్‌లు (URLs) పంపడం ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ లోపాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యక్తులు, సంస్థలు వెంటనే అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని CERT-In సూచించింది.

వాట్సాప్‌లో గుర్తించిన 5 ప్రధాన భద్రతా లోపాలు ఇవే..

ఆర్డర్ డీటెయిల్స్ మెసేజ్ లోపం (CVE-2026-102769): ప్రత్యేకంగా రూపొందించిన ‘ఆర్డర్ డీటెయిల్స్’ మెసేజ్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు ట్యాప్ చేస్తే, SQL ఇంజెక్షన్ లోపం ద్వారా ఫోన్‌లో ఉన్న లోకల్ వాట్సాప్ ఫైల్స్ డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది. మెసేజ్ వచ్చినప్పుడు యూజర్ ఆన్‌లైన్‌లో ఉంటే చాట్ డేటాబేస్ సమాచారాన్ని హ్యాకర్లు తెలుసుకోగలరు.

మెటా ఏఐ సర్టిఫికెట్ లోపం (CVE-2026-44908): మెటా ఏఐ (Meta AI) కంప్యూటింగ్ సిస్టమ్‌తో అనుసంధానమయ్యే సర్టిఫికెట్ చైన్ ధృవీకరణలో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల డివైజ్ భద్రతను దాటి యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ లోపం దుర్వినియోగం కాలేదని వాట్సాప్ స్పష్టం చేసింది.

యాడ్-రిప్లై యూఆర్ఎల్ లోపం (CVE-2026-23871): ఆండ్రాయిడ్‌లో ‘క్లిక్ టు వాట్సాప్’ ప్రకటనల రిప్లై యూఆర్ఎల్‌లలో ఉన్న ఈ లోపం ద్వారా హ్యాకర్ల నియంత్రణలోని చిరునామా నుంచి మీడియా లోడ్ అయి, బాధితుడి ఐపీ (IP) అడ్రస్ బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది. కొన్ని స్పామ్ మెసేజ్‌లలో దీనిని వాడి ఉండవచ్చని వాట్సాప్ పేర్కొంది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఏఐ రెస్పాన్స్ లోపం (CVE-2026-23866): ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు సంబంధించిన ఏఐ రెస్పాన్స్ ద్వారా iOS, ఆండ్రాయిడ్ డివైజ్‌లలో హ్యాకర్లు ఉంచిన హానికరమైన యూఆర్ఎల్ ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంది.

విండోస్ అటాచ్‌మెంట్ లోపం (CVE-2026-23863): విండోస్ వాట్సాప్‌లో ఒక సాధారణ ఫైల్‌లా కనిపించే అటాచ్‌మెంట్‌ను ఓపెన్ చేసినప్పుడు, అది హానికరమైన ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌లా రన్ అయ్యే ప్రమాదం ఉంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions