Wednesday 11th November 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సోనియా గాంధీ వ్యాఖ్యలపై అన్నా హజారే ఫైర్.. ఆ వ్యాఖ్యలు సరికావు!

సోనియా గాంధీ వ్యాఖ్యలపై అన్నా హజారే ఫైర్.. ఆ వ్యాఖ్యలు సరికావు!

  • ‘ఫలాలిచ్చే చెట్టుకే రాళ్ల దెబ్బలు’!

Anna Hazare Reacts To Sonia Gandhi Memoir కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇటీవల రచించిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) లో 2011 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాలు కాకుండా దేశం, సమాజ క్షేమం కోసం ఆలోచించాలని ఆమెకు హితవు పలికారు. కాంగ్రెస్ లేదా బీజేపీలతో తనకు ఎలాంటి వ్యక్తిగత, రాజకీయ సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

సోనియా గాంధీ పుస్తకంలో ఏముంది?

తన ఆత్మకథలో సోనియా గాంధీ 2011 నాటి ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ (IAC) ఉద్యమాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో అన్నా హజారే నేతృత్వంలో సాగిన భారీ ఉద్యమానికి తెరవెనక నుండి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల మద్దతు లభించిందని, ఉద్యమంలో పాల్గొన్న కొందరు ప్రముఖులే తర్వాతి కాలంలో ఈ విషయాన్ని వెల్లడించారని రాసుకొచ్చారు.

యూపీఏను దించడమే లక్ష్యం..

ఈ ఉద్యమం నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ (UPA) ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని, ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రత్యర్థుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అది నెరవేరిన తర్వాత అన్నా హజారే గురించి ఎవరూ మాట్లాడలేదని వ్యాఖ్యానించారు.

అన్నా హజారే కౌంటర్..

బుధవారం మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో మీడియాతో మాట్లాడిన అన్నా హజారే సోనియా వ్యాఖ్యలపై గట్టిగా స్పందించారు. తన ఉద్యమం కేవలం ఒక పార్టీకే పరిమితం కాలేదని, నాటి ఉద్యమం వల్ల ఆర్ఎస్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు కూడా తమ పదవులను కోల్పోయారని గుర్తుచేశారు. తనకు ఏ రాజకీయ పార్టీ కంటే కూడా సమాజం, దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని తెలిపారు. కరువు సమయంలో బాధితులను ఆదుకోవడానికి తన సొంత పింఛను డబ్బులను ఖర్చు చేస్తున్నానని, నాయకులు ఇలాంటి సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఫలాలిచ్చే చెట్టుకే రాళ్ల దెబ్బలు..

“ఫలాలిచ్చే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి” అని వ్యాఖ్యానించిన హజారే.. విమర్శలను తాను పట్టించుకోనని, తన జీవితాన్ని దేశానికే అంకితం చేశానని వెల్లడించారు. త్వరలోనే విడుదల కానున్న తన ఆత్మకథ ‘అన్నా హజారే: గ్రామయోగి’ పుస్తకంలో తన జీవిత విశేషాలు, ఉద్యమ సత్యాలన్నీ ఉంటాయని అన్నా హజారే వెల్లడించారు.

You may also like
ప్రధాని పదవి తిరస్కరణ రహస్యం ఇదే.. ‘బిలాంగింగ్’లో సోనియా గాంధీ!
ఇన్‌స్టాగ్రామ్‌ లోకి సోనియా గాంధీ ఎంట్రీ.. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే!
వందేమాతరం వివాదం: సోనియా, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు!
ఏఐసీసీ ఆఫీసులో వందేమాతరం వివాదం.. సోనియా, రాహుల్ హావభావాలపై బీజేపీ ఫైర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions