Thursday 5th November 2026
12:07:03 PM
Home > క్రీడలు > అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు క్రిస్టియానో రొనాల్డో వీడ్కోలు!

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు క్రిస్టియానో రొనాల్డో వీడ్కోలు!

Cristiano Ronaldo Retires From International Football ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యున్నత రికార్డులు సృష్టించిన లెజెండరీ ఆటగాడు క్రిస్టెయ్నో రొనాల్డో (Cristiano Ronaldo) తన 23 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ వీడియోను పంచుకుంటూ పోర్చుగల్ జాతీయ జట్టుకు వీడ్కోలు పలుకుతున్నట్లు 41 ఏళ్ల రొనాల్డో అధికారికంగా వెల్లడించారు. పోర్చుగల్ కోచ్‌ జార్జ్ జీసస్‌తో నెలకొన్న వివాదాలు, విభేదాల నేపథ్యంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

అసాధారణ రికార్డులతో వీడ్కోలు..

2003 ఆగస్టులో పోర్చుగల్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రొనాల్డో.. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా, అత్యధిక గోల్స్ సాధించిన వీరుడిగా చరిత్ర సృష్టించారు.

మొత్తం మ్యాచ్‌లు: 234 అప్పీయరెన్సులు
అంతర్జాతీయ గోల్స్: 146 గోల్స్

2016లో యూరో కప్ (Euro 2016), 2019 మరియు 2025లో నేషన్స్ లీగ్ (Nations League) టైటిళ్లను పోర్చుగల్‌కు అందించడంలో కీలక పాత్ర పోషించారు. తాను ఎంతో గర్వంగా ధరించిన ‘నెం.7’ (No. 7) జెర్సీని తదుపరి తరానికి అప్పగిస్తున్నట్లు రొనాల్డో ప్రకటించారు.

వీడ్కోలు సందేశంలో రొనాల్డో భావోద్వేగం..

“నేడు జాతీయ జట్టుతో నా పిచ్ ప్రయాణం ముగిసింది. నేను నడిచిన బాట గురించి గర్వపడుతూ, పోర్చుగల్ కోసం నా సర్వస్వాన్ని అందించానన్న సంతృప్తితో తల ఎత్తుకుని వెళుతున్నాను. పోర్చుగల్ ఎప్పటికీ నాలోనే ఉంటుంది” అని రొనాల్డో తన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నారు.

కోచ్‌తో వివాదం – టర్బులెంట్ ఎండింగ్..

అక్టోబర్‌లో పోర్చుగల్ కోచ్‌ జార్జ్ జీసస్‌ (Jorge Jesus) తో ఏర్పడిన బహిరంగ వివాదం రొనాల్డో వీడ్కోలుకు ప్రధాన కారణమైంది. నార్వేతో జరిగిన మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం కావడం, కోచ్‌ ఇచ్చిన మాట తప్పడంపై రొనాల్డో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ట్రైనింగ్ క్యాంప్ వీడి వెళ్లడం, అనంతరం క్షమాపణ చెప్పడం వంటి పరిణామాలు జరిగాయి. ఫెడరేషన్ ఆయనకు సస్పెన్షన్ విధించినప్పటికీ, ఈ వివాదాల నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.

You may also like
ఫ్యాక్ట్ చెక్: భారత్-పాక్ మహిళా క్రికెటర్లు మైదానంలో గొడవ పడ్డారా?
ప్రపంచ యోగాసనా ఛాంపియన్‌షిప్‌లో భారత్ సంచలనం!
allegations on messi by keralam sport minister
మెస్సీపై కేరళం మంత్రి సంచలన ఆరోపణలు!
virat
ఆర్సీబీలో ఐదుగురు విదేశీ ఆటగాళ్లా..! మిస్టర్ నాగ్ సెటైరికల్ ఇంటర్వ్యూ వైరల్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions