Thursday 22nd October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!

వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!

Non BS6 Vehicles Ban Delhi Entry రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో పెరిగే వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం వింటర్ యాక్షన్ ప్లాన్‌ను (Winter Action Plan) సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నవంబర్ 1, 2026 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు పలు కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించిన ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కాలుష్య నివారణకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ఢిల్లీ బయట రిజిస్టరై, బీఎస్‌-6 (BS-6) ప్రమాణాలు లేని నాన్-బీఎస్‌6 వాహనాలను రాజధానిలోకి అనుమతించరు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్, సీఎన్‌జీ వాహనాలు మరియు అత్యవసర సేవలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.

‘నో పీయూసీ – నో ఫ్యూయల్’..

ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో చెల్లుబాటులో ఉన్న పీయూసీ (PUC – Pollution Under Control) సర్టిఫికెట్ లేని ఏ వాహనానికైనా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ లేదా ఎల్‌పీజీ పోయడాన్ని నిరాకరిస్తారు. నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు సుమారు 500 పెట్రోల్ బంకుల్లో ఏఎన్‌పీఆర్ (ANPR) కెమెరాలను ఏర్పాటు చేశారు.

పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ రద్ది, వాహనాల ద్వారా వెలువడే ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో విడతలవారీ వేళలతో పాటు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఎంసీడీ (MCD) ఆఫీసులు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయి.

పెరిగిన పార్కింగ్ ఛార్జీలు..

ప్రైవేట్ వాహనాల వాడకాన్ని తగ్గించేందుకు మున్సిపల్ పరిధిలోని అధీకృత పార్కింగ్ స్థలాల్లో ఫీజులను రెట్టింపు చేయనున్నారు. అయితే డీఎంఆర్‌సీ (DMRC) మెట్రో పార్కింగ్ స్థలాలకు ఈ పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు.

నిర్మాణ రంగాలపై ఆంక్షలు: దుమ్ము, ధూళిని వెలువరించే బహిరంగ నిర్మాణ, కూల్చివేత పట్ల కఠిన ఆంక్షలు ఉంటాయి. డిసెంబర్ 10 నుంచి జనవరి 20 వరకు దుమ్ముతో కూడిన నిర్మాణాలపై పూర్తి నిషేధం అమలవుతుంది. ప్రధాన నిర్మాణ సైట్లలో కృత్రిమ మేధస్సు (AI) మానిటరింగ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశారు.

ప్రజలు ప్రైవేట్ వాహనాలకు బదులుగా మెట్రో సేవలు, ఎలక్ట్రిక్ బస్సులు, కార్‌పూలింగ్ వంటి ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

You may also like
అమిత్ షా 62వ పుట్టినరోజు: ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు!
ఇన్‌స్టాగ్రామ్‌ లోకి సోనియా గాంధీ ఎంట్రీ.. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే!
new trains from hyderabad
మొబైల్స్‌లో పెద్ద శబ్దాలతో పాటలు వింటే జైలుకే!
అపరిశుభ్రమైన టాయిలెట్ ఫోటో పంపితే రూ.1000 FASTag రీఛార్జ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions