Thursday 22nd October 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: జనసేన విజ్ఞప్తితో ఈ గుర్తుల తొలగింపు!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: జనసేన విజ్ఞప్తితో ఈ గుర్తుల తొలగింపు!

SEC Removes Bucket Pen Stand Symbols ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న వేళ, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఎస్‌ఈసీ.. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితా నుంచి ‘బకెట్’, ‘పెన్ స్టాండ్’ గుర్తులను తాత్కాలికంగా తొలగిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

నిర్ణయానికి దారితీసిన పరిస్థితులువే…

జనసేన పార్టీ అధికారిక ఎన్నికల గుర్తు అయిన ‘గాజు గ్లాసు’ పోలికలను ఈ రెండు గుర్తులు (బకెట్, పెన్ స్టాండ్) పోలి ఉన్నాయని, దీనివల్ల ఓటింగ్ సమయంలో ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని జనసేన ప్రతినిధులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. గత ఎన్నికల సమయంలో పోలింగ్ సరళిని ఉటంకిస్తూ.. ఓటర్లలో ఎలాంటి అయోమయం తలెత్తకుండా ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు.

ఎస్‌ఈసీ స్పందన..

జనసేన పార్టీ అభ్యర్థనలోని న్యాయబద్ధతను పరిశీలించిన ఎన్నికల సంఘం.. ఓటర్ల స్పష్టతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిటర్నింగ్ అధికారులందరూ స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించేటప్పుడు ఈ రెండు గుర్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయించవద్దని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఎస్‌ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జనసేన శ్రేణులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

You may also like
pawan kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరిట నకిలీ వాట్సాప్ ఛానల్!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions