- నెలకు రూ.7 లక్షల సంపాదన.. రూ.3.4 లక్షల పొదుపు!
Indian Income Savings In Sydney ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివసిస్తున్న దివ్యాంజ్ గౌతమ్ అనే భారతీయుడు, ఆస్ట్రేలియాను విడిచిపెట్టి స్వదేశానికి తిరిగి వచ్చే ముందు తన నెలవారీ ఆదాయం, ఖర్చులు మరియు పొదుపు వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఒక భారతీయ నిత్యావసర వస్తువుల దుకాణంలో కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన, సొంతంగా కన్సల్టింగ్ వ్యాపారాన్ని నెలకొల్పి నెలకు లక్షలాది రూపాయలు ఎలా సంపాదించారో స్పష్టమైన గణాంకాలతో వివరించారు.
ఆస్ట్రేలియా వదిలే ముందు ఒక ఖచ్చితమైన ప్రణాళిక కంటే ఆర్థిక భద్రతే (Financial Cushion) ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
దివ్యాంజ్ ఆదాయం & ఖర్చుల వివరాలు
సిడ్నీలో ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్లో వారానికి 6 రోజులు పనిచేస్తూ వారం జీతంగా $500 (సుమారు రూ. 47,976) పొందేవాడు. ఆ తర్వాత ఒక రిటైల్ ఉద్యోగంలో చేరి వారానికి $1,100 (రూ. 1,05,547) సంపాదించాడు.
‘సైకోసోషల్ రిస్క్ కన్సల్టెంట్’గా సొంత ప్రాక్టీస్ ప్రారంభించాక, ప్రతి క్లయింట్ నుండి నెలకు $3,000 (రూ. 2,87,893) తీసుకున్నాడు. పన్నులకు ముందు అతని సగటు నెలవారీ ఆదాయం $10,000 (రూ. 9,59,643) కి చేరింది.
పన్నులు పోనూ నెలకు దాదాపు $7,500 (సుమారు రూ. 7,19,753) చేతికి వచ్చేది.
నెలవారీ ఖర్చులు ($3,900 / రూ. 3.74 లక్షలు):
ఇంటి అద్దె: $2,400 (రూ. 2,30,321)
కరెంట్, నీటి బిల్లులు: $350 (రూ. 33,588)
గ్రోసరీస్ (కిరాణా): $500 (రూ. 47,981)
జిమ్ సభ్యత్వం: $100 (రూ. 9,596)
ఎంటర్టైన్మెంట్/బయటకు వెళ్లడం: $500 – $600 (రూ. 47,981 – రూ. 57,590)
మిగిలే పొదుపు: నెలకు $7,500 సంపాదనలో $3,900 ఖర్చులు పోగా, నెలకు దాదాపు $3,600 (సుమారు రూ. 3,45,543) నికరంగా పొదుపు చేసినట్లు తెలిపాడు.








