Friday 11th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ఓట్ల సవరణ రక్తం చిందని మారణహోమం’

‘ఓట్ల సవరణ రక్తం చిందని మారణహోమం’

prakashraj
  • కేంద్రం, ఈసీపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!

Prakash Raj Speech Lamakaan ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ (ECI) తీరుపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓట్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను ఆయన ‘రక్తం చిందని మారణహోమం’ (Bloodless Genocide)గా అభివర్ణించారు. దేశంలో ప్రస్తుతం ఆధునిక సెన్సార్‌షిప్ నడుస్తోందని, ప్రజలను భయాందోళనలోకి నెడుతున్నారని విమర్శించారు.

12 కోట్ల ఓట్ల తొలగింపు..

గురువారం హైదరాబాద్‌లోని లమకాన్‌లో పుస్తకావిష్కరణ సభలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. ఓటర్ల జాబితా నుంచి దాదాపు 12 కోట్ల పేర్లను నిశ్శబ్దంగా తొలగించారని ఆరోపించారు. ప్రజల డేటాను ఉపయోగించి ఆదివాసీలు, దళితులు, ముస్లింలు మరియు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మారుస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

రాజ్యాంగం అడ్డుగా ఉండటం వల్లే సైన్యం నేరుగా అధికారం చేపట్టలేకపోతోందని, అయితే వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని రహిత నియంత్రణ సాధిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం నింపిన భయం వల్ల రచయితలు, ఫిల్మ్ మేకర్లు స్వీయ నియంత్రణ (Self-Censorship) పాటించే దుస్థితి ఏర్పడిందన్నారు.

నోట్ల రద్దు, మూకదాడులు, ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా ప్రజలను ఆందోళనలో ఉంచుతున్నారని పేర్కొంటూ, సినిమాలో తాను ఎదుర్కొన్న సెన్సార్‌షిప్ అనుభవాలను పంచుకున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions