- సర్టిఫికెట్లు లేకపోయినా అప్లై చేసుకోవచ్చు!
TG New Pension Application | తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం, సెర్ప్ (SERP) పెద్ద ఊరటనిచ్చింది. దరఖాస్తు చేసే సమయంలో ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోయినా ముందుగా అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
సర్టిఫికెట్ల ఆలస్యం వల్ల గడువు ముగిసిపోతుందేమోనని ఆందోళన చెందుతున్న వారికి ఈ నిర్ణయంతో ఉపశమనం లభించింది.
ప్రభుత్వ కీలక సడలింపులు..
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది. సదరం, కులం, ఆదాయం మరియు మరణ ధ్రువీకరణ పత్రాల జాప్యంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సర్టిఫికెట్లతో సంబంధం లేకుండా ముందుగా ఆన్‌లైన్ లేదా మీసేవాలో దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.
దరఖాస్తు చేసే సమయానికి సర్టిఫికెట్లు అవసరం లేదు. కానీ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన (Verification) చేసే సమయానికి మాత్రం ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 15 చివరి తేదీ..
కొత్త పింఛన్ల దరఖాస్తుకు సెప్టెంబర్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.







