Friday 26th June 2026
12:07:03 PM
Home > క్రైమ్ > కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు!

కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు!

  • బ్లాక్‌మెయిల్, కోట్లాది రూపాయల ఆస్తిపై కన్నేసిన ప్రియుడు!

Ketan Agarwal Murder Case | దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) హత్య కేసు దర్యాప్తులో రోజుకో పచ్చి నిజం వెలుగులోకి వస్తోంది.

ప్రీ వెడ్డింగ్ షూట్ నెపంతో కాబోయే భర్తను లోయలోకి తోసి చంపిన నిందితురాలు సియా గోయల్ (Siya Goyal), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (Chetan Choudhary) విచారణలో ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.

ఈ క్రమంలో, ఈ ఘాతుకం వెనుక చేతన్ చేసిన బ్లాక్‌మెయిల్ కోణం, అగర్వాల్ కుటుంబానికి ఉన్న అపారమైన సామాజిక హోదా, వందల కోట్ల సంపదను హస్తగతం చేసుకోవాలనే పక్కా స్కెచ్ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

పర్సనల్ మెసేజ్‌లతో సియాకు బ్లాక్‌మెయిల్?

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ హత్య కుట్రలో సియాను చేతన్ బలవంతంగా లాగాడా అనే కోణంలో విచారణ జరుగుతోంది. సియాతో గతంలో రికార్డ్ చేసిన ఫోన్ కాల్స్, ప్రైవేట్ మెసేజ్‌లను (Private Messages) ఉపయోగించి చేతన్ ఆమెను బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.

కేతన్‌ను చంపే ప్లాన్‌లో పాల్గొనకపోతే, ఈ సీక్రెట్ సంబంధాన్ని పలుకుబడి కలిగిన అగర్వాల్ కుటుంబానికి లీక్ చేస్తానని చేతన్ బెదిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మే నెల విఫలయత్నమే శాపం..

మే నెలలోనే కేతన్‌పై జరిగిన మొదటి విఫల హత్యాయత్నంలో సియా పాత్ర ఉంది. ఆ విషయాన్ని బయటపెడతానని బెదిరిస్తూ, జూన్ 18న జరిగిన తుది హత్య కుట్ర నుండి సియా వెనక్కి తగ్గకుండా చేతన్ ఒత్తిడి తెచ్చినట్లు డిజిటల్ ఆధారాల ద్వారా స్పష్టమవుతోంది.

రూ. 17 కోట్ల పెళ్లి ప్యాలెస్.. టార్గెట్ అగర్వాల్ సంపద..

సియా, కేతన్‌లకు ఫిబ్రవరిలో నిశ్చితార్థం కాగా, నవంబర్‌లో జైపూర్‌లోని ఒక రాయల్ ప్యాలెస్‌ను రూ. 17 కోట్లకు బుక్ చేశారు. అతిథుల కోసం రెండు ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేశారు.

ఇంతటి అపారమైన సంపద, హోదా చూశాకే.. సియాతో కలిసి పారిపోవాలన్న తన పాత ప్లాన్‌ను మార్చుకుని, కేతన్‌ను పూర్తిగా చంపేయాలని చేతన్ డిసైడ్ అయ్యాడు. కేతన్ చనిపోయాక, పెళ్లి తర్వాత సియా ద్వారా ఆ అపార సంపదను, హోదాను వాడుకోవాలని చేతన్ ఆశించినట్లు దర్యాప్తులో తేలింది.

సియా బ్యాంక్ అకౌంట్ల ఆడిట్.. చేతన్‌కు భారీగా నిధులు?..

కేతన్‌ను వెంబడించడానికి, నిఘా ప్రయాణాలు, రవాణా, దుస్తుల ఖర్చుల కోసం సియా తన బ్యాంక్ ఖాతాల నుండి చేతన్‌కు రహస్యంగా పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేసిందా అనే కోణంలో పోలీసులు ఆడిట్ నిర్వహిస్తున్నారు.

జూన్ 18 నేరానికి కొన్ని రోజుల ముందు చేతన్ తక్షణ ఖర్చుల కోసం సియా భారీగా నగదు విత్‌డ్రా చేసినట్లు ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. కేతన్ అనే ‘అడ్డంకి’ తొలగిపోతే, చేతన్‌కు నెలవారీ భత్యం లేదా తన కుటుంబ వనరుల నుండి ఒకేసారి భారీ మొత్తం ఇస్తానని సియా వాగ్దానం చేసినట్లు సమాచారం.

ఒకే వారంలో రెండుసార్లు హత్యాయత్నం.. ప్లాన్-సి కూడా రెడీ..

జూన్ 14న, సియా కేతన్‌ను లోహగడ్ కోటకు తీసుకువెళ్లి మొదట లోయలోకి తోసింది. కానీ అతను కొండ అంచున ఉన్న ఒక పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో నకిలీ పాము వచ్చిందంటూ అరిచి, భయపడినట్టు నటిస్తూ కేతన్‌ను కౌగిలించుకుని తనపై అనుమానం రాకుండా ఆనవాళ్లు చెరిపేసింది.

ఆ తర్వాత మళ్లీ కోటకు వెళ్దామని ఒప్పించి, ఈసారి ప్రియుడు చేతన్‌ను కూడా పిలిపించింది. ఇద్దరూ కలిసి వెనుక నుండి లోయలోకి తోసి కేతన్‌ను చంపేశారు. ఒకవేళ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయితే, ‘ప్లాన్ సి’ ని కూడా వీరు సిద్ధం చేసుకోవడం వీరి క్రూరత్వానికి అద్దం పడుతోంది.

మొదట్లో బలమైన గాలుల వల్ల ఫోటోలు తీసుకుంటూ కేతన్ ప్రమాదవశాత్తూ పడిపోయాడని నమ్మించినా, సియా ముఖంలో ఎలాంటి విచారం లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. గురువారం వీరిద్దరినీ ముఖాముఖి కూర్చోబెట్టగా.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ నేరానికి సూత్రధారి అవతలి వ్యక్తేనని వాదించుకున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions