Friday 26th June 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం!

తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం!

  • అధికారిక ఉత్తర్వులు జారీ!

Sanjay Jaju New Chief Secretary Telangana | తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకమయ్యారు.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు (G.O.Rt.No.911) జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పదవీ విరమణ పొందుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

రామకృష్ణారావు స్థానంలో బాధ్యతలు..

తెలంగాణ ప్రభుత్వంలో సుదీర్ఘ సేవలు అందించిన ప్రస్తుత ముఖ్య కార్యదర్శి/సీఎస్ కే. రామకృష్ణారావు, ఐఏఎస్ ఈ నెల 30, 2026 మధ్యాహ్నం పదవీ విరమణ చేయనున్నారు.

ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నూతన సీఎస్‌గా ప్రభుత్వం నియమించింది.

ఈ నియామకపు నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. రఘునందన్ రావు గవర్నర్ పేరిట విడుదల చేశారు. దీనిని తెలంగాణ అధికారిక గెజెట్ అసాధారణ సంచికలో ప్రచురించాల్సిందిగా ఆదేశించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions