Wednesday 17th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > జాతీయ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!

జాతీయ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!

Pawan Kalyan Delhi Janasena Meeting | జాతీయ రాజకీయాల పరిణామాలే లక్ష్యంగా దేశ రాజధాని ఢిల్లీలో జనసేన పార్టీ సరికొత్త ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది.

‘జాతీయ సమగ్రత దృక్పథంతో, సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం’ అనే ప్రత్యేక శీర్షికతో సోమవారం (జూన్ 15, 2026) ఢిల్లీలోని ప్రతిష్టాత్మక అశోక హోటల్‌లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఘనంగా నిర్వహించనుంది.

ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశం కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

పుష్కర కాల ప్రస్థానంపై ప్రత్యేక చర్చ..

జనసేన పార్టీని స్థాపించి విజయవంతంగా పుష్కర కాలం (12 ఏళ్లు) పూర్తి కావస్తున్న తరుణంలో ఈ సమావేశాన్ని ఢిల్లీ వేదికగా నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

గడిచిన ఈ పుష్కర కాలంలో జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా సాగింది, దేశ సమైక్యతపై పార్టీ ఎటువంటి జాతీయ భావజాలంతో ముందుకు వెళ్తోందనే అంశాలను పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో సుదీర్ఘంగా వివరించనున్నారు.

ఈ విస్తృత స్థాయి సమావేశంలో జనసేన పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు (MPs), శాసనమండలి సభ్యులు (MLCs), శాసనసభ్యులు (MLAs) మరియు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

ప్రస్తుత దేశ వర్తమాన పరిస్థితుల్లో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ, అందరం సమైక్యంగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు.

ఈ నేపథ్యంలోనే మారుతున్న దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధులకు, కీలక నాయకులకు ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. సోమవారం ఉదయం అశోక హోటల్‌లో ప్రారంభం కానున్న ఈ ఉన్నత స్థాయి సమావేశం, రోజంతా సాగి సాయంత్రానికి ముగియనుంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions