- రాబోయే 48 గంటలు అత్యంత కీలకం!
- ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ!
- గంటకు 50 కిమీ వేగంతో ఈదురు గాలులు..
- వాతావరణ శాఖ అలర్ట్!
Heavy Rainfall Alert For Telangana | తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో వాతావరణం మరింత చల్లబడటంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) మంగళవారం హెచ్చరించింది.
రాబోయే 48 గంటల పాటు, అంటే గురువారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన (Heavy Rainfall Alert) జారీ చేసింది.
ఐఎండీ నివేదిక ప్రకారం.. 64.5 మిమీ నుండి 115.5 మిమీ వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున కింద పేర్కొన్న జిల్లాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
రంగారెడ్డి
వికారాబాద్
సంగారెడ్డి
మెదక్
కామారెడ్డి
మహబూబ్‌నగర్
నారాయణపేట
జోగులాంబ గద్వాల
హైదరాబాద్ సహా 30 జిల్లాలకు ఉరుములు, ఈదురు గాలుల హెచ్చరికః భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
గంటకు 40 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు (Gusty Winds) వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ మరియు నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
శనివారం వరకు ముప్పు పొంచి ఉందా..
గురువారంతోనే ఈ వాతావరణ మార్పులు ముగిసిపోవట్లేదని, హైదరాబాద్ వాతావరణ శాఖ మరికొన్ని రోజుల పాటు పొడిగించిన హెచ్చరికలను జారీ చేసింది.
గురువారం నుండి శనివారం వరకు కూడా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అలర్ట్ ఇచ్చింది. ప్రయాణాలు చేసే వారు, రైతులు వాతావరణ అప్‌డేట్స్‌ను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.










