Saturday 23rd May 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ జెర్సీతో మంత్రి సందడి!

ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ జెర్సీతో మంత్రి సందడి!

ponguleti
  • ఆర్సీబీ మ్యాచ్‌లో SRHకు సపోర్ట్!

Minister Ponguleti in SRH Jersey | ఐపీఎల్ (IPL) లీగ్ మ్యాచ్‌లలో భాగంగా శుక్రవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఒక అద్భుతమైన సెలబ్రేషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సామాన్య అభిమానులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా క్యూ కట్టారు.

అయితే, అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సరికొత్త లుక్‌లో స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు.

సాధారణంగా వీఐపీ బాక్సులకే పరిమితమయ్యే నేతలకు భిన్నంగా.. మంత్రి పొంగులేటి పక్కా సన్‌రైజర్స్ ఆరెంజ్ జెర్సీని ధరించి గ్యాలరీలో కూర్చోవడం స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

హోం గ్రౌండ్‌లో చివరి లీగ్ మ్యాచ్ – ఫ్యాన్స్ పూనకాలు..
ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు ఉప్పల్ స్టేడియంలో ఇదే చివరి హోం మ్యాచ్ కావడం, అలాగే ఇరు జట్లకు ఇది అత్యంత కీలకమైన చివరి లీగ్ మ్యాచ్ కావడంతో స్టేడియం మొత్తం ఆరెంజ్ కలర్‌తో కిక్కిరిసిపోయింది.

ఈ క్రేజీ వైబ్‌ను ఎంజాయ్ చేయడానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మ్యాచ్ ముగిసే వరకు గ్యాలరీలోనే ఉండి ప్రతి ఫోర్, సిక్సర్‌కు చప్పట్లు కొడుతూ హైదరాబాద్ జట్టుకు తన పూర్తి మద్దతును తెలియజేశారు

మంత్రి వెంట సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కూడా ఉన్నారు. ఆయన కూడా గ్యాలరీ నుంచే ఉప్పల్ మ్యాచ్ హంగామాను వీక్షించారు.

ఆరెంజ్ ఆర్మీ విధ్వంసం.. ఫ్యాన్స్‌ కు డబుల్ ధమాకా..
మంత్రితో పాటు స్టేడియానికి వచ్చిన వేలాది మంది అభిమానులకు సన్‌రైజర్స్ ఆటగాళ్లు తమ బ్యాటింగ్ విధ్వంసంతో పూనకాలు తెప్పించారు.

మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఏకంగా 255 పరుగుల భారీ స్కోరు సాధించి ఆర్సీబీ ముందే కొండలాంటి లక్ష్యాన్ని ఉంచింది.

అనంతరం భారీ ఛేదనలో ఆర్సీబీని 200 పరుగులకే కట్టడి చేసి 55 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చారిత్రాత్మక విజయం సాధించింది.

హోం గ్రౌండ్‌లో తమ జట్టు గెలవడం, అదే సమయంలో గ్యాలరీలో మంత్రి స్వయంగా జెర్సీ వేసుకుని సందడి చేయడంతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions