Tuesday 19th May 2026
12:07:03 PM
Home > క్రీడలు > IPL ప్లేఆఫ్స్ క్లైమాక్స్.. CSK vs SRH ‘మహా సంగ్రామం’!

IPL ప్లేఆఫ్స్ క్లైమాక్స్.. CSK vs SRH ‘మహా సంగ్రామం’!

csk vs srh

CSK vs SRH | ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్‌లు చివరి అంకానికి చేరుకోవడంతో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. సోమవారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగబోయే మ్యాచ్‌పై లీగ్‌లోని సగం జట్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ఈ మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికను తలకిందులు చేయనుండటంతో, మిగతా జట్ల అభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) గెలిస్తే..
హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టోర్నీలో మిగతా జట్లకు పెద్ద షాక్ తగిలినట్టే. ఈ విజయంతో హైదరాబాద్ 16 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్‌ కు అర్హత సాధిస్తుంది. హైదరాబాద్ గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ మినహా మరే ఇతర జట్టు కూడా 16 పాయింట్లు సాధించే అవకాశం ఉండదు.

దీనివల్ల గుజరాత్ టైటాన్స్ కూడా ప్లేఆఫ్స్ రేసులో సురక్షితమైన స్థానానికి చేరుకుంటుంది. లీగ్‌లోని మెజారిటీ జట్ల ఆశలపై హైదరాబాద్ విజయం నీళ్లు చల్లుతుంది.

ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నెగ్గితే..
ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే మాత్రం లీగ్‌లో సరికొత్త సమీకరణాలు మొదలై, మిగతా జట్లకు పండుగే అని చెప్పాలి.  

ఈ గెలుపుతో చెన్నై 14 పాయింట్లతో నేరుగా టాప్-4 రేసులోకి దూసుకువస్తుంది. సీఎస్కే గెలుపు వల్ల పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

టోర్నీ ఆఖరి మ్యాచ్ వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. చెన్నై విజయం సాధిస్తే, ధర్మశాల వేదికగా జరగబోయే హై-వోల్టేజ్ ‘క్వాలీఫయర్-1’ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆడటం దాదాపు ఖాయమవుతుంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions