Bandi Sanjay’s Mother Suffers Heart Attack | కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయన మాతృమూర్తి శకుంతల శుక్రవారం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు.
కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, అత్యవసరంగా గుండెకు స్టంట్ (Stunt) వేశారు.
ప్రస్తుతం ఆమె ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ విషయం తెలియగానే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసుపత్రికి చేరుకుని తన తల్లిని పరామర్శించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..
ఈ పరిణామంపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “అమ్మ ఎవరికైనా అమ్మే.. బండి సంజయ్ మాతృమూర్తి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొంటూనే సంజయ్‌కు ఒక బ్రదర్లీ సలహా ఇచ్చారు.
“సంజయ్ గారికి ఒక సలహా.. దయచేసి అమ్మగారికి ఈ వయసులో మైనర్ బాలిక అంశంలో (పోక్సో కేసు) బయటకు వస్తున్న విషయాలు, తన మనుమడు భగీరథ్ మీద వస్తున్న తీవ్ర ఆరోపణల గురించి చెప్పకండి.
సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, హైకోర్టు నిర్ణయాల గురించి అస్సలు ప్రస్తావించవద్దు. ఆమెను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచండి. ఈ వయసులో ఆమె గుండె నిబ్బరంగా, ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం.”
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుమడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు హైకోర్టు విచారణలో ఉన్న తరుణంలో, ఆ వార్తలు పెద్ద వయసున్న ఆమె ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపే ప్రమాదం ఉందని ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.







