Ramoji Rao Passes Away | తెలుగు మీడియా మొఘల్, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీ రావు (Ramoji Rao) శనివారం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
ప్రధాని నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలు, సినీ రాజకీయ ప్రముఖులు రామోజీ రావు మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
కృష్ణా జిల్లా పెదపారుపూడిలో వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు దంపతులకు 1936 నవంబర్ 18న జన్మించారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. తాత మరణించిన 13 రోజులకు జన్మించడంతో ఆయన జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్యగా నామకరణం చేశారు.
అయితే తనకు రామయ్య అనే పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడే తనకు తానే “రామోజీ రావు” అన్న పేరును సృష్టించుకుని పెట్టుకున్నారు.
ఆ రామోజీ రావు పేరు నేడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆయన మరణంతో రామోజీ రావు అనే పేరు గూగుల్ టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా కొనసాగుతోంది