Wednesday 13th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ఆ ఘటన నా అహాన్ని అణిచి వేసింది’రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!  

‘ఆ ఘటన నా అహాన్ని అణిచి వేసింది’రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!  

rajnikanth

Rajnikanth Interesting Comments | ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajnikanth) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లుతాయి. అలాంటి అపారమైన ఫ్యాన్ బేస్ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒకసారి ఎవరూ పట్టించుకోలేదట.

ఒక ఆశ్రమంలో తనను ఎవరూ గుర్తుపట్టలేదని, కనీసం తన వైపు చూడలేదని చెప్పారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం 45వ వార్షికోత్సవం, శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని తన జీవితంలోని ఒక అద్భుతమైన అనుభవాన్ని పంచుకున్నారు.

ఆశ్రమంలోని ఒక గుర్రానికి తన పేరు పెట్టడం చూసి ఆశ్చర్యపోయానని, 2 రోజులు ఉందామని వెళ్లి 15 రోజులు అక్కడే ఉండిపోయానని రజనీ తెలిపారు.

“నేను సూపర్ స్టార్‌ను కాబట్టి ఆశ్రమంలో అందరూ నా వెంట పడతారని అనుకున్నాను. కానీ, అక్కడ వందలాది మంది తమిళులు ఉన్నా ఒక్కరు కూడా నా వైపు కన్నెత్తి చూడలేదు. నేను చేయి ఊపినా ఎవరూ పట్టించుకోలేదు” అని నవ్వుతూ చెప్పారు.

ఆ సంఘటన తనలోని అహాన్ని పూర్తిగా అణచివేసిందని, ఆధ్యాత్మిక శక్తి ముందు లౌకిక స్టార్‌డమ్ ఎంత చిన్నదో అప్పుడు అర్థమైందని రజనీకాంత్ వివరించారు.

“సినిమా స్టార్‌డమ్ తాత్కాలికం. కానీ ఆధ్యాత్మిక స్టార్‌డమ్ అత్యున్నతమైనది, శాశ్వతమైనది. అది మరణం తర్వాత కూడా పెరుగుతూనే ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions