- పూలే జయంతి వేళ ఆత్మీయ పలకరింపు..
- నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!
PM Modi and Rahul Gandhi In One Frame | రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి రుజువైంది. పార్లమెంటు ప్రాంగణంలో శనివారం (ఏప్రిల్ 11, 2026) అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒకరినొకరు పలకరించుకోవడమే కాకుండా, కొద్దిసేపు ఆత్మీయంగా సంభాషించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలోని ‘ప్రేరణ స్థల్’ వద్ద ప్రముఖులు నివాళులర్పించేందుకు చేరుకున్నారు.
పూలే విగ్రహానికి నివాళులర్పించేందుకు ప్రధాని మోదీ అక్కడికి రాగానే.. అప్పటికే అక్కడ ఉన్న స్పీకర్ ఓం బిర్లా, రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఆయనకు స్వాగతం పలికారు.
ప్రధాని మోదీ నేరుగా రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి పలకరించారు. ఇద్దరు నేతలు కొద్ది నిమిషాల పాటు నవ్వుతూ ముచ్చటించుకున్నారు. సాధారణంగా సభలో వాడీవేడిగా తలపడే ఈ ఇరువురు నేతలు, బయట ఇంత ప్రశాంతంగా మాట్లాడుకోవడం అక్కడున్న వారిని ఆకర్షించింది.
వైరల్ అవుతున్న వీడియో..
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ సంభాషిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. “ప్రజాస్వామ్య సౌందర్యం అంటే ఇదే” అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే.. “వీరు దేని గురించి చర్చించి ఉంటారు?” అని మరికొందరు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.
పూలే వంటి గొప్ప సంస్కర్త జయంతి రోజున దేశంలోని అగ్ర నేతలు ఇలా కలిసి కనిపించడం ఒక సానుకూల సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.






