Sunday 31st May 2026
12:07:03 PM
Home > తాజా > తప్పుడు ప్రచారం నమ్మొద్దు.. ఇంటర్ ఫలితాలపై విద్యాశాఖ స్పష్టత!

తప్పుడు ప్రచారం నమ్మొద్దు.. ఇంటర్ ఫలితాలపై విద్యాశాఖ స్పష్టత!

tg results clarity

Inter results 2026 delays clarification | ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను విద్యాశాఖ తీవ్రంగా ఖండించింది.

ఫలితాల ప్రకటనను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, అవన్నీ ఫేక్ పోస్టులని స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు కేవలం గందరగోళం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నమేనని, అటువంటి ప్రచారాలను నమ్మవద్దని విద్యాశాఖ కోరింది.ఫలితాల ప్రకటన ముందే అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని అధికారులు తెలిపారు.

గతంలో ఎప్పుడూ ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదని, సాధారణంగా ఏప్రిల్ చివరి వారం, మే లేదా జూన్ మాసాల్లోనే ఫలితాలు వెల్లడవుతాయని గుర్తు చేశారు.

జవాబు పత్రాల మూల్యాంకనం (Valuation) మరియు ఇతర సాంకేతిక ప్రక్రియల ఆధారంగా ప్రతి ఏటా ఫలితాల తేదీలు మారుతుంటాయని, ఈ ఏడాది కూడా అదే పద్ధతి కొనసాగుతుందని వివరించారు.

ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కేవలం విద్యాశాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.

త్వరలోనే ఫలితాల తేదీపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అప్పటివరకు అనవసరపు పుకార్లకు దూరంగా ఉండాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.

You may also like
tg results clarity
ఇంటర్ ఫలితాలు రేపే.. వాట్సప్ లోనే చెక్ చేసుకోండి!
Students
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions