Wednesday 16th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఇరాన్‌పై ట్రంప్ ‘బూతు’ పురాణం.. 48 గంటల డెడ్‌లైన్!

ఇరాన్‌పై ట్రంప్ ‘బూతు’ పురాణం.. 48 గంటల డెడ్‌లైన్!

‌- హార్ముజ్ తెరవకుంటే పవర్ ప్లాంట్లు, వంతెనలపై భీకర దాడులు!

Donald Trump warning to Iran | పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన మరియు వివాదాస్పద పదజాలంతో విరుచుకుపడ్డారు.

ఇరాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఒక అగ్రరాజ్య అధ్యక్షుడి హోదాలో ఉండి.. ఇరాన్ నాయకత్వాన్ని ఉద్దేశించి ‘ఎఫ్ వర్డ్’ (F-word), ‘బాస్టర్డ్స్’ (Bastards) వంటి బూతు పదజాలాన్ని వాడటం దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తక్షణమే తెరవాలని ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. నిర్ణీత సమయంలోగా జలసంధిని తెరవకపోతే, వచ్చే మంగళవారం నుండి ఇరాన్‌లోని కీలకమైన పవర్ ప్లాంట్లు, వంతెనలు మరియు మౌలిక సదుపాయాలపై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు.

“మునుపెన్నడూ చూడని విధంగా ఈ దాడులు ఉంటాయి.. 48 గంటల తర్వాత ఇరాన్ ఒక నరకకూపంగా మారుతుంది” అంటూ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం చెలాయించడం పట్ల అమెరికా మొదటి నుంచీ ఆగ్రహంతో ఉంది.

అయితే, ట్రంప్ వాడిన భాష మరియు నేరుగా పౌర వసతులపై దాడులు చేస్తామన్న ప్రకటన అంతర్జాతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించనప్పటికీ, పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పుడైనా చేయి దాటిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

You may also like
నేపాల్ వరదలు: 626కు పెరిగిన మృతుల సంఖ్య, 2500 మంది గల్లంతు!
పిల్లల్ని కంటే రూ. 55 లక్షలు.. ఎక్కడో తెలుసా!
అర నిమిషంలో 195ముద్దులు.. గిన్నిస్ బుక్‌లోకెక్కిన లవర్స్!
ఇండోనేషియాలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions