Friday 3rd April 2026
12:07:03 PM
Home > తాజా > రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

KCR Hanuman Jayanthi Wishes | హనుమాన్ జయంతి సందర్భంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ సీతారామచంద్రమూర్తి భక్తుడుగా.,బలం, జ్ఞానం, వాక్చాతుర్యం అన్నీకలిసి, అరుదైన వ్యక్తిత్వం కలిగిన జ్ఞానిగా, హిందూ పురాణాలు హనుమంతుడిని కీర్తిస్తాయని కేసీఆర్ తెలిపారు.

సంత్ తులసీదాస్ తన రామచరిత మానస్ లో చెప్పినట్టు,అంజనీ సుతుడు,,“జ్ఞానినాం అగ్రగణ్యం”., అంటే, జ్ఞానుల్లో అత్యున్నతుడు..అని కేసీఆర్ పేర్కొన్నారు.

వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు అన్నట్టు
“న వాక్యదోషం… నచ అపశబ్దం”..అంటే., ఎటువంటి దోషాలు లేని భాషతో, ఉచ్చారణతో, వ్యాకరణం మీద పట్టుతో వాక్ శుద్ధితో ప్రసంగించే గొప్ప వక్త హనుమంతుడు.. అని కేసీఆర్ కొనియాడారు.

ధర్మ రక్షణ కోసం, తాను నమ్మిన శ్రీ రామునికి తన శక్తినంతా ధారపోసి, ఎటువంటి ప్రతి ఫలాపేక్ష లేకుండా, ప్రజా సంక్షేమం కోసం నాయకత్వాన్ని తన భుజాలమీద మోసిన బలశాలి, వినయానికి ,విజయానికి మార్గదర్శి, మృదుస్వభావి శ్రీ ఆంజనేయ స్వామి అని కేసీఆర్ కొనియాడారు.

జ్ఞానం వాక్చాతుర్యం బలం భక్తి వినయం అన్నీ కలెగలిసిన సంపూర్ణ వ్యక్తిత్వం హనుమంతుడికే సాధ్యం అన్నారు. వారి ఆచరణ ఎల్లకాలం ఆదర్శనీయమని, నేటి యువతరానికి ఆచరణీయమని కేసీఆర్ తెలిపారు.

ఆదర్శవంతమైన ఆలోచనలతో, దూరదృష్టితో, తమ జీవితాలను తీర్చిదిద్దుకునే శక్తిని హనుమంతుడు రాష్ట్ర ప్రజలకు అందించాలని, ప్రగతి తిరిగి పుంజుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని కేసీఆర్ ప్రార్ధించారు.

You may also like
tgspdcl
ఏప్రిల్ 8 నుంచి విద్యుత్ ఆర్టిసన్ల నిరవధిక సమ్మె!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions