Thursday 26th March 2026
12:07:03 PM
Home > తాజా > ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ అదే!

ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ అదే!

KBK Speech in Impact Foundation Program

– ‘ఇంపాక్ట్’ వేదికగా కేబీకే స్ఫూర్తిదాయక ప్రసంగం!

KBK Speech In Impact Program | “మీరు ఎంట్రప్రెన్యూర్ కావడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు.. కానీ పక్కా అనాలసిస్ మాత్రం ఉండాలి. ప్రపంచంలో డాలర్ కంటే అత్యంత విలువైన కరెన్సీ ఏదైనా ఉందంటే అది మీ దగ్గర ఉన్న ‘స్కిల్’ మాత్రమే” అని కేబీకే (KBK) గ్రూప్ అధినేత కక్కిరేణి భరత్ కుమార్ పేర్కొన్నారు.

లయన్స్ క్లబ్ మరియు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలో విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తల కోసం నిర్వహించిన మోటివేషనల్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను పంచుకుంటూ ఆంత్రప్రెన్యూర్ షిప్ కి అయినా, బిజినెస్ కి అయినా సక్సెస్ అవ్వాలంటే ఐదు సూత్రాలు పాటించాలని సూచించారు.

గొప్పగా ఆలోచించండి..
ఏ ప్రాజెక్ట్ చేసినా ఆలోచన గొప్పగా ఉండాలి. ఎంత పెద్దగా ఆలోచిస్తే విజయం అంత గొప్పగా ఉంటుంది.

విలువైన కరెన్సీ అదే:
డబ్బు సంపాదించడం కంటే నైపుణ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. స్కిల్ ఉంటే కరెన్సీ ఆటోమేటిక్‌గా వస్తుంది.

పర్ఫెక్ట్ ఎన్విరాన్ మెంట్:
మన చుట్టూ ఉండే వాతావరణం మన ఎదుగుదలను శాసిస్తుంది. సైంటిస్ట్ మీర్జా ఫైజా తన కూతురి కోసం సృష్టించిన వాతావరణం, ‘డిస్కవర్ స్టెమ్’ సంస్థ ద్వారా నేడు ఎంతో మంది పిల్లలకు పేటెంట్లు తెచ్చిపెడుతోందని ఆయన ఉదాహరణగా చెప్పారు. సంపాదించిన డబ్బునంతటినీ ఒకేచోట ఇన్వెస్ట్ చేయకుండా, పొదుపు చేసుకుంటూ జాగ్రత్తగా ముందడుగు వేయాలి.

AI తో అద్భుతాలు..
నేడు ప్రపంచాన్ని ఏఐ (Artificial Intelligence) శాసిస్తోంది. ఒక ఐటీ ఉద్యోగి కంటే ఎక్కువగా విద్యార్థులు ఫ్రీలాన్స్ వెబ్‌సైట్ల ద్వారా సంపాదించవచ్చని, బిజినెస్ గ్రోత్ కోసం ఏఐని వాడుకోవాలని సూచించారు.

లొకేషన్ అనేది ఒక భ్రమ మాత్రమే..

చాలామంది వ్యాపారానికి లొకేషన్ ప్రధానం అనుకుంటారని, కానీ అది నిజం కాదని భరత్ కుమార్ స్పష్టం చేశారు. “నా ఐటీ ఆఫీస్‌ను బేగంపేట నుండి ఉప్పల్‌కు మార్చినప్పుడు అందరూ విమర్శించారు. కానీ జోహో (Zoho) సంస్థను చూస్తే అర్థమవుతుంది.. తమిళనాడులోని ఒక మారుమూల గ్రామం నుండి నేడు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోంది.

ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ కూడా క్షేత్రస్థాయి అనుభవంతోనే సక్సెస్ అయ్యారు” అని ఆయన గుర్తు చేశారు. ఈ అద్భుతమైన అవకాశం కల్పించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గంప నాగేశ్వరరావు గారికి భరత్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions