Friday 8th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ధురంధర్ 2’ పై సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన పోస్ట్!

‘ధురంధర్ 2’ పై సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన పోస్ట్!

Rajinikanth post on dhurandhar

Rajinikanth Post On Dhurandhar 2 | బాలీవుడ్ రణ్‌వీర్ సింగ్ (Ranveer singh) నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revange) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.

ఈ యాక్షన్ డ్రామాపై తాజాగా భారతీయ చిత్ర పరిశ్రమ దిగ్గజం, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు. దర్శకుడు ఆదిత్య ధర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“‘ధురంధర్ 2’ ఒక అద్భుతమైన చిత్రం. దర్శకుడు ఆదిత్య ధర్ నిజంగా ‘బాక్సాఫీస్ కా బాప్’. రణ్‌వీర్ సింగ్ మరియు చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా ఇది. జై హింద్!” అంటూ రజనీకాంత్ పోస్ట్ చేశారు.

సూపర్ స్టార్ ప్రశంసలపై దర్శకుడు ఆదిత్య ధర్ స్పందించారు. “సార్, మేమంతా మీ సినిమాలను చూస్తూ, మీ మ్యాజిక్‌ను ఆస్వాదిస్తూ పెరిగాం. వినోదానికి మీరే మా బెంచ్‌మార్క్.

అలాంటి మీరు మా సినిమాను ‘తప్పక చూడాలి’ అని రికమండ్ చేయడం నా జీవితంలో అతిపెద్ద ‘సూపర్ స్టార్ మూమెంట్’. మీ ఆశీస్సులకు ధన్యవాదాలు” అంటూ ఎమోషనల్ అయ్యారు.

ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లోనూ భారీ వసూళ్లు సాధిస్తూ 2026లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions