Sunday 19th April 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!

జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!

BR Naidu Comments ON Jagan | మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu). ఇటీవల బీఆర్ నాయుడిదిగా పేర్కొంటూ పలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెల్సిందే.

ఈ తరుణంలో టీటీడీ ఛైర్మన్ (TTD Chairman) పై జగన్ కన్నెర్ర చేశారు. జగన్ విమర్శలపై బీఆర్ నాయుడు తాజగా స్పందించారు. హిందుత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని బీఆర్ నాయుడు ధ్వజమెత్తారు.

హిందూ వ్యతిరేకి అయిన జగన్ సీఎంగా ఉన్నారనే ధైర్యంతోనే వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి రెచ్చిపోయి హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారని సంచలన ఆరోపణలు చేశారు.

ఒక పథకం ప్రకారం తిరుమల కొండపై యథేచ్ఛగా అన్యమత ప్రచారం చేశారని అన్యమతస్తుడైన జగన్ ఇప్పటివరకు దేవదేవునిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని ఘాటుగా ప్రశ్నించారు.

టీటీడీలో అన్యమతస్తులు ఉండరాదని తాను నిర్ణయం తీసుకున్న నాడే తనపై పథకం ప్రకారం కుట్రలు జగన్ ప్రారంభించారని అందులో భాగంగానే తనపై డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తిరుమల ప్రతిష్ట దెబ్బతీయాలని చూశారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

జగన్ జీవితంలో తన భార్యతో కలిసి తిరుమలకు రాలేడని ఎందుకంటే వారిద్దరూ నమ్మేది ఏసుప్రభువునే కానీ శ్రీ వేంకటేశ్వర స్వామిని కాదు కాబట్టి అంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

You may also like
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions