Sunday 30th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > స్టాలిన్‌ వర్సెస్ విజయ్: తమిళ రాజకీయాల్లో హీట్ పెంచిన ‘దళపతి’!

స్టాలిన్‌ వర్సెస్ విజయ్: తమిళ రాజకీయాల్లో హీట్ పెంచిన ‘దళపతి’!

vijay hot comments on cm stalin

Vijay Comments on Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై (CM MK Stalin) టీవీకే అధినేత విజయ్ (Vijay)తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాల గురించి కావని, ఇవి స్టాలిన్ వర్సెస్ విజయ్ (Stalin Vs Vijay) మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

వెల్లూరు జిల్లాలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ప్రజలకు మరియు డీఎంకే ప్రభుత్వ అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటమని విజయ్ అభివర్ణించారు.తమిళనాడు రాజకీయ పరిస్థితిని జల్లికట్టు ఎద్దుతో పోల్చుతూ.. మార్పు కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తామంతా కలిసి ఆ మార్పును తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.

నెలవారీ కరెంట్ బిల్లుల హామీ, శాంతిభద్రతలు, మహిళా భద్రత వంటి అంశాల్లో డీఎంకే విఫలమైందని విమర్శించారు.రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత నేతలు తమ ఆస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం వస్తే ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా మారుస్తామని, ప్రతి పోలింగ్ బూత్‌లో విజయం సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

You may also like
త్రిష పేరుతో వ్యాఖ్య.. ఉదయనిధిపై TVK, BJP తీవ్ర విమర్శలు!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions