Sunday 30th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘బంగారం ధర పెరగడానికి కారణం అదే’

‘బంగారం ధర పెరగడానికి కారణం అదే’

nirmala sitharaman on gold price hike


కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్!

Reason Behind Gold Price Hike | గత కొన్ని నెలలుగా బంగారం ధర (Gold Price) విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం ఏంటో వివరించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.

ప్రపంచ దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటమే పసిడి ధరల అనూహ్య పెరుగుదలకు ప్రధాన కారణమని వెల్లడించారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశంలోకి బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకరంగా ఏమీ లేవని, ఆర్బీఐ వీటిని నిరంతరం పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. కరెంట్ ఖాతా లోటు (CAD) కూడా నియంత్రణలోనే ఉందని తెలిపారు. భారత్ వృద్ధి పథంలో ఉందని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెంచి భాగస్వాములు కావాలని కోరారు.

బ్యాంకులు తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టాలని సూచించారు. భారత్ సహా ఇతర దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 15 శాతం టారిఫ్ అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోందని తెలిపారు. దీని ప్రభావంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటే అవుతుందని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్ ఆర్థిక పరిస్థితి సుస్థిరంగా ఉందని ఆమె భరోసా ఇచ్చారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions