Saturday 22nd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > టెక్సాస్ లో 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై అమెరికన్ సంచలన వ్యాఖ్యలు!

టెక్సాస్ లో 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై అమెరికన్ సంచలన వ్యాఖ్యలు!

carlos turcios comments on hanuman statue

Carlos Turcios Comments On Hanuman Statue | అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రంలో నిర్మించిన 90 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహంపై అమెరికా రాజకీయ కార్యకర్త కార్లోస్ టుర్సియోస్ (Carlos Turcios ) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

హ్యూస్టన్ సమీపంలోని షుగర్ ల్యాండ్‌లో ఉన్న శ్రీ అష్టలక్ష్మి ప్రాంగణంలో 2024లో ఆగస్టులో 90 అడుగుల “పంచలోహ అభయ హనుమాన్” విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉత్తర అమెరికాలోనే ఎత్తైన హనుమాన్ విగ్రహంగా ఇది గుర్తింపు పొందింది.

అయితే తాజాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మద్దతుదారుడు టుర్సియోస్ ఈ విగ్రహాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇది ఇండియానో పాకిస్తానో కాదు. ఇది టెక్సాస్. విదేశీయులు మన దేశాన్ని ఆక్రమిస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో దేవాలయానికి చెందిన సభ్యులు స్పందిస్తూ, ఈ నిర్మాణం పూర్తిగా భక్తుల విరాళాలతో నిర్మించబడిందని, అన్ని మతాల వారికీ ఆలయం తెరిచి ఉంటుందని తెలిపారు.

అమెరికాలో వివిధ మతాలకు చెందిన పెద్ద విగ్రహాలు, చర్చిలు, ఆలయాలు నిర్మించడం సాధారణమని, ఇది మత స్వేచ్ఛకు నిదర్శనమని పేర్కొన్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions